Event Page

«Prev From Mar 5, '26 to Apr 4, '26 Next»
10372
చరిత్ర స్వరాలు
Thu Mar 5, 5:00 PM
Lamakaan
ఇవి చరిత్ర స్వరాలు. సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళు తరబడి బిగించిన ఉరిలో చిట్లిన కంఠనాళాల రుధిర స్వరాలు.

కందుకూరు రాజ్యలక్ష్మమ్మ - డా c మృణాలిని
బెంగళూరు నాగరత్నమ్మ - డా సమ్మెట ఉమాదేవి
దుర్గబాయి దేశముఖ్ - వోల్గా
డా కొమర్రాజు అచ్చమాంబ - వేమన వసంత లక్ష్మి
చిట్యాల ఐలమ్మ - సలీమ
కొమ్మూరి పద్మావతీ దేవి - పి ప్రమీల
సారా పోరాటమ్మ - సహజ
వ్యాఖ్యాత - అక్కినేని కుటుంబరావు